వెలిగండ్ల నూతన ఎంపీడీవోగా గంగాధర్
ప్రకాశం: వెలిగండ్ల మండలం నూతన ఎంపీడీవోగా గంగాధర్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కర్నూల్ జిల్లా డివిజనల్ పంచాయతీ ఆఫీసులో గంగాధర్ ఏవోగా పనిచేస్తూ పదోన్నతిపై వెలిగండ్ల ఎంపీడీవోగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంపై కృషి చేస్తానని తెలిపారు.