కే .కోటపాడులో సబ్ స్టేషన్‌లను ప్రారంభించిన ఎంపీ
AKP: రాష్ట్రంలో రూ. 250 కోట్లతో 69 విద్యుత్ సబ్ స్టేషన్‌లు నిర్మిస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బుధవారం కే .కోటపాడు మండలం చౌడువాడ, కింతలిలో నిర్మించిన సబ్ స్టేషన్‌లను ఎంపీ, సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి ప్రారంభించారు. జిల్లాలో 20వేల ఎస్సీ, ఎస్టీల గృహాలకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.