హిందూమహాసముద్రంలోకి ఇరాన్ క్షిపణులు
హిందూ మహాసముద్రంలోని UK-US సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు చేసింది. డిగో గార్సియా ద్వీపంలో ఉన్న స్థావరంపై 2 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. అయితే వీటిలో ఒకటి విఫలం కాగా, మరొకదాన్ని అమెరికా యుద్ధనౌక అడ్డుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇరాన్ భూభాగానికి ఈ ద్వీపం 4వేల కి.మీ దూరంలో ఉంది. తమ క్షిపణులు సామర్థ్యం 2కి.మీ అని ఇరాన్ చెప్పింది నిజం కాదని ఈ ప్రయోగంతో తేలింది.