మూడో విడత ఎన్నికలు.. పటిష్ట బందోబస్తు: ఎస్పీ
MBNR: జిల్లాలో ఈనెల 17న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పి జానకి తెలిపారు. బాలనగర్, మూసాపేట, భూత్పూర్, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల మండలాలలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.