సాయిబాబా జయంతిని ప్రభుత్వం చేయడం సిగ్గు చేటు

NLR: పుట్టపర్తి సాయిబాబా శతజయంతిని ప్రభుత్వం పండగగా జరపడాన్ని నెల్లూరులో హేతువాద సంఘం నేతలు అభ్యంతరం తెలిపారు. ఆయన శతజయంతిని ప్రభుత్వ పండగగా జరపాలని జీవో తీసుకురావడం సిగ్గుచేటన్నారు. ఒక బాబా పుట్టిన రోజు ప్రభుత్వం చేయడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమన్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయాలను పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు.