'టీటీడీ చైర్మన్ నాయుడును పదవి నుంచి తొలగించాలి'
కోనసీమ: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన ఉపయోగిస్తున్న భాష తిరుమల పవిత్రతను దిగజార్చుతున్నాయని వైసీపీ అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ అన్నారు. శనివారం పట్టణంలో వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించి, నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ నిరసన తెలిపారు.