VIDEO: హెల్మెట్ లేకున్నా పెట్రోల్ పంపిణీ
BHPL: జిల్లా కేంద్రంలోని HP పెట్రోల్ బంక్ వద్ద "నో హెల్మెట్- నో ఫ్యూయల్" బోర్డు ఉన్నప్పటికీ, హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ అందిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకుండా ఫ్యూయల్ పంపిణీ జరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరుతున్నారు.