'డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పనకు ఎగ్ స్టాల్స్'

'డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పనకు ఎగ్ స్టాల్స్'

కోనసీమ: డ్వాక్రా మహిళలకి స్వయం ఉపాధి కల్పించేందుకు PMGSY పథకం కింద ఎగ్ కార్డ్స్ (స్టాల్) ప్రభుత్వం అందిస్తుందని డీఆర్డీఏ పీడీ రాంబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మండలాలలో డ్వాక్రా మహిళలు ఉపాధి పొందేందుకు ఈ స్టాల్స్ అందిస్తున్నట్లు తెలిపారు. మండలానికి ఒక స్టాల్ ఇస్తున్నామన్నారు. రెండో విడతలో రావులపాలెం, అమలాపురంలో 12 స్టాల్స్ అందిస్తామని పేర్కొన్నారు.