గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

అన్నమయ్య: రాజంపేట పట్టణం సమీపంలోని బైపాస్ రోడ్డుపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.