ఒకే సమయంలో రెండు ప్రమాదాలు

ఒకే సమయంలో రెండు ప్రమాదాలు

TPT: తిరుపతి-చెన్నై హైవేపై ములగమూడి వద్ద ఆవును కారు ఢీకొట్టింది. కారు పూర్తిగా డ్యామేజ్ కాగా.. ఆవుకు తీవ్ర గాయాలయ్యాయి. వడమాలపేట అంజేరమ్మ కనుమ నుంచి తిరుపతికి బైక్ మీద వెళ్తున్న వ్యక్తి ఈ ఘటననూ చూస్తూ సడన్ బ్రేక్ వేయడంతో జారిపడి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడటంతో రుయాకు తరలించారు. క్షతగాత్రుడు యూనివర్సిటీ ఉద్యోగి చలపతిగా గుర్తించారు.