VIDEO: తెనాలిలో కొనసాగుతున్న అభిమానుల సందడి

VIDEO: తెనాలిలో కొనసాగుతున్న అభిమానుల సందడి

GNTR: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా విడుదల సందర్భంగా తెనాలిలో అభిమానుల సందడి నెలకొంది. సినిమా రిలీజ్ ఒకరోజు ముందుగానే, బుధవారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక షో ప్రదర్శించనున్నారు. మంగళవారం పట్టణంలోని అన్ని థియేటర్లను పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో అభిమానులు నింపేశారు. అయితే, టిక్కెట్ ధర రూ. 1000 ఉండటంతో కొంతమంది అభిమానులు నిరాశకు గురయ్యారు.