సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం
NRPT: ఉట్కూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ప్రాంగణంలో సోమవారం పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కానిస్టేబుల్స్ దేవేందర్, చంద్రాయుడు పాల్గొని ఆన్లైన్ మోసాలు, ఫోన్ కాల్ స్కామ్‌లు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి సైబర్ నేరాల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండే విధానాలను వివరించారు. మోసం జరిగితే పోలీసులను సంప్రదించాన్నారు.