ఈ-కామర్స్ అనైతిక పద్ధతులకు కేంద్రం కళ్లెం
వినియోగదారులను మోసగించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు అనుసరిస్తున్న 'డార్క్ ప్యాటర్న్స్'ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ అనైతిక పద్ధతులను తొలగించడానికి వీలుగా సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలంటూ నిబంధనలు విధించింది. వీటిని అమలు చేసేందుకు 26 ప్రధాన ఈ-కామర్స్ కంపెనీలు ముందుకొచ్చాయి. ఫ్లిప్‌కార్ట్, మేక్ మై ట్రిప్ వంటి కంపెనీలు ఆడిట్ చేసినట్లు చెప్పాయి.