భక్తి పారవశ్యంతో నిండిన వేములవాడ

భక్తి పారవశ్యంతో నిండిన వేములవాడ

SRCL: కార్తిక సోమవారం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పలువురు భీమేశ్వరాలయంలో కోడె మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో వేములవాడలోని వీధులన్నీ భక్తి పారవశ్యంతో సందడిగా మారాయి.