పొలాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే
ADB: జిల్లాలో బసవన్నలను పూజించే సంస్కృతి గొప్పదని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన పొలాల అమావాస్య పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బసవన్నలకు ప్రత్యేక పూజలు చేసి డప్పుల చప్పుళ్లతో గ్రామంలో నిర్వహించిన ఊరేగింపు చేపట్టారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేకగా తెలంగాణ పండుగలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.