కోతకు గురైన పెద్దవాగు బ్రిడ్జిని పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: కరకగూడెం మండలంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా కోతకు గురైన పెద్దవాగు బ్రిడ్జిని సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, R&B అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారీ వర్షాలు పడకముందే మరమ్మతు పనులు పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం రూ .20 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.