ALERT: కాసేపట్లో వర్షాలు

ALERT: కాసేపట్లో వర్షాలు

TG: రాష్ట్రంలో కాసేపట్లో వర్షం పడనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. HYD, రంగారెడ్డి జిల్లాలతో పాటు మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నల్లగొండలో వర్షాలు పడనున్నాయని ప్రకటించారు. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోందని పేర్కొన్నారు. గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. రేపు 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.