బనగానపల్లెలో ఘనంగా మొహర్రం వేడుకలు

బనగానపల్లెలో ఘనంగా మొహర్రం వేడుకలు

NDL: బనగానపల్లె పట్టణంలో ఆదివారం మొహర్రం వేడుకలను పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కొలువుతీరిన పీర్లకు భక్తులు ప్రత్యేక ఫాతేహాలు సమర్పించి, పూజలు చేశారు. మొహర్రం వేడుకల సందర్భంగా ఆస్థానం సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు పీర్లను ఊరేగింపు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.