మొదలైన తాగునీటి కష్టాలు.. గ్రామాల్లో చెలిమ నీరే దిక్కు

మొదలైన తాగునీటి కష్టాలు.. గ్రామాల్లో చెలిమ నీరే దిక్కు

ASF: బెజ్జూర్ మండలంలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు కిలోమీటర్ల దూరంలోని వాగుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. పెంచికల్ పేట మండలంలోని జిల్లెడ, మోర్లిగూడ గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. పైప్ లైన లీకేజీలు, సరఫరా లోపాలతో వేసవి ప్రారంభంలోనే భూగర్భజలాలు తగ్గి వాగులు ఎండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.