మహిళా నాయకులతో మాజీ మంత్రి భేటీ

మహిళా నాయకులతో మాజీ మంత్రి భేటీ

W.G: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ చరిత్రలో మహిళలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకు వైసీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ మహిళా నాయకులతో సమావేశమయ్యారు. వైసీపీ రాజకీయ చరిత్రలో నిరంతరం మహిళలకే పెద్దపీట వేశారని అదే స్ఫూర్తితో మహిళలు పార్టీ కోసం పనిచేశారని అన్నారు.