అయ్యప్ప స్వామి దేవాలయానికి లక్ష విరాళం
SRD: సదాశివపేటలోని అయ్యప్ప స్వామి దేవాలయానికి మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ రేణుక లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు గోనే శంకర్, ఉపాధ్యక్షుడు సుధాకర్ గౌడ్, కోశాధికారి రాచన్న గురుస్వాములు పాల్గొన్నారు.