VIDEO: పులివెందులలో అంగన్వాడీ కార్యకర్తల నిరసన
KDP: పులివెందుల పట్టణంలోని స్థానిక మినీ సెక్రెటరీయేట్ కార్యాలయ ఆవరణంలో మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్లకు వేసవి సెలవులు ప్రకటించాలని, తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.