నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఉమామహేశ్వర్

BPT: జిల్లా నూతన ఎస్పీగా ఉమామహేశ్వర్ నేడు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో అరాచక శక్తులపై ఉక్కుపాదం మోపుతానని, శాంతి భద్రతలను పరిరక్షించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.