'నాలుగు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు'
MNCL: వరి కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జన్నారం ఐకెపీ ఎపీఎం లలిత అన్నారు. శుక్రవారం జన్నారం మండలంలోని తిమ్మాపూర్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడున్న గన్ని బ్యాగులను తనిఖీ చేశారు. ఐకెపీ ద్వారా 14 కొనుగోలు కేంద్రాలు మంజూరు కాగా, 4 కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు.