జిల్లా కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ కొరత

అనంతపురం: సుదూర ప్రాంతాల నుంచి వివిధ కారణాల రీత్యా ప్రజలు నగరానికి విచ్చేస్తుంటారు. నగరంలో పబ్లిక్ టాయిలెట్ల కొరత ఎక్కువగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. శ్రీకంఠం, సప్తగిరి, రాజురోడ్, టవర్ క్లాక్, గవర్నమెంట్ హాస్పిటల్(రుద్రంపేట, తపోవనం) బైపాస్ ఇతర ప్రధాన కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్స్ లేవన్నారు. అధికారులు స్పందించి పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.