BIG ALERT: మీసేవ కేంద్రాలు బంద్

BIG ALERT: మీసేవ కేంద్రాలు బంద్

TG: రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాలు బంద్ అయ్యాయి. దాదాపు 36 గంటల పాటు సర్వర్లు అందుబాటులో ఉండవని ఐటీ అధికారులు తెలిపారు. మీసేవ పోర్టల్‌లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను అప్‌లోడ్ చేయడం, డేటా సెంటర్ల వార్షిక నిర్వహణ పనుల కారణంగా అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటల తర్వాత మీసేవ వెబ్‌సైట్ తిరిగి యాక్టివ్ అవుతుంది.