ఆరోగ్యంపై ఉద్యమంలా కృషి చేయాలి: సీఎం
GNTR: రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య పరిస్థితుల సాధనకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లి ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని మంగళగిరిలో జరిగిన సమావేశంలో సూచించారు. ప్రతి నెల 4వ శనివారం ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.