ఆ స్థలాలను ముస్లింలు స్వచ్ఛందంగా ఇవ్వాలి: మొహమ్మద్
రామ జన్మభూమి, మధుర, జ్ఞానవాపి స్థలాలను ముస్లింలు స్వచ్ఛందంగానే హిందువులకు అప్పగిస్తే మంచిదని మాజీ ASI చీఫ్ కేకే ముహమ్మద్ సూచించారు. ముస్లీంలకు మక్కా, మదీనా ఎలాగో హిందువులకు రామజన్మభూమి, మధుర, జ్ఞానవాపి అలాగే అని అన్నారు. అలాగే హిందువులు ఇతర స్థలాలను వివాదం చేయొద్దని కోరారు. ఈ సందర్భంగా తాజ్‌మహల్ కింద ఆలయం ఉందనే వాదనను ఆయన కొట్టిపారేశారు.