మత్స్యకారులను రెచ్చగొడుతున్నారు: ప్రశాంతిరెడ్డి
AP: వైసీపీ రాజకీయం చేసి మత్స్యకారులను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మండిపడ్డారు. మత్స్యకారులకు మొదటి నుంచి వైసీపీనే ద్రోహం చేస్తూ వచ్చిందని ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ ప్రైవేట్ పరం చేశారన్నది అవాస్తవమన్నారు. మత్స్యకారులకు అన్యాయం చేయాలన్న ఆలోచన లేదన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే వైసీపీ ఆరాటపడుతుందని స్పష్టం చేశారు.