రాజుల చెరువు గెడ్డ ఆక్రమణ రైతులు ఆందోళన

VZM: శృంగవరపుకోట కెనరా బ్యాంకు వెనుకాతల గల 462 సర్వే నెంబరు గల రాజుల చెరువు గెడ్డ ఆక్రమణకు గురైనదని రైతులు ఆందోళన చేపట్టారు, జేసీబీతో చదును చేస్తుండగా చెరువు ఆధారిత రైతులు అడ్డుకొని సదరు రెవిన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు,ఎం.ఆర్.ఓ కిరణ్‌కుమార్ రాజుల చెరువు గెడ్డ ఆక్రమణ స్థలమును పూర్తిగా పరిశీలించి ప్రభుత్వపరమైన చర్యలు చేపడతామని రైతులకు తెలియజేసారు.