సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన పొన్నం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని గొల్లపల్లి చౌరస్తా బైపాస్ రోడ్డులో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్, మాజీ జిల్లా పరిషత్ ఛైర్మన్ తుల ఉమ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.