30 లీటర్ల సారాతో ఒకరి అరెస్ట్

30 లీటర్ల సారాతో ఒకరి అరెస్ట్

ASR: అడ్డతీగల మండలం రాయపల్లికి చెందిన పిల్లారిశెట్టి సూర్యారావును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నాటు సారా అమ్మకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారంతో ఆయన ఇంటిపై దాడి చేసి 30 లీటర్ల సారాయి స్వాధీనం చేసుకున్నట్లు దుచ్చర్తి ఎస్సై వెంకయ్య తెలిపారు. నిందితుడిని అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.