అమరావతిలో జండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

అమరావతిలో జండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం

PLD: అమరావతి మండల కేంద్రంలో మహిళల రక్షణ, సమస్యల తక్షణ పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జండర్ రిసోర్స్ సెంటర్‌ను సోమవారం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రారంభించారు. ఈ సెంటర్‌ను రూ. 5 లక్షల నిధులతో మూడేళ్ల పాటు నిర్వహిస్తారు. మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.