VIDEO: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ రాస్తారోకో

హనుమకొండ: జిల్లా చౌరస్తాలో నేడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. రహదారులపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి రాస్తారోకో చేయడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.