అక్కినేని అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే

ఒంగోలు నగరంలోని సీవీఆర్ రీడింగ్ రూమ్ నందు అక్కినేని కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అక్కినేని నాగేశ్వరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అక్కినేని అవార్డ్స్ కార్యక్రమంలో వారు అవార్డులను ప్రదానం చేశారు.