వైద్య కళాశాలను సందర్శించిన కలెక్టర్
NLG: కళాశాలలో ఎవరైనా ర్యాగింగ్ పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై జిల్లా కలెక్టర్ శుక్రవారం స్థానిక సంస్థల ఇంఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డిలతో కలిసి ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు.