రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క సూచనలు
MLG: రాష్ట్ర ప్రజలకు మంత్రి సీతక్క సూచనలుచేసారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అన్ని GPలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేస్తామన్నారు.