అల్‌-ఫలా యూనివర్సిటీకి 'న్యాక్‌' షోకాజ్ నోటీసులు

అల్‌-ఫలా యూనివర్సిటీకి 'న్యాక్‌' షోకాజ్ నోటీసులు

ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్-ఫలా యూనివర్సిటీకి 'న్యాక్' షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు పొందకుండా లేదా అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకోకుండా తన వెబ్‌సైట్‌లో కళాశాలకు గుర్తింపు ఉందని ప్రచారం చేసుకుంటుందని అందుకే నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను, తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుందని మండిపడ్డారు.