రహదారులే రైతులకు కల్లాలు
HNK: శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో పంటలు ఆరబెట్టేందుకు అవసరమైన కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతుల కష్టాలు ఒకవైపు పెరుగుతుండగా, మరోవైపు రహదారుల పై ప్రయాణించే ప్రజలకు ప్రమాదాల ముప్పు ఎక్కువవుతోంది. ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలను రోడ్లపైనే పరచడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.