యూరియా కోసం రైతుల రాస్తా రోకో

యూరియా కోసం రైతుల రాస్తా రోకో

మహబూబాబాద్: మరిపెడ మున్సిపల్ కేంద్రంలో యూరియా కోసం రైతులు గురువారం రాస్తా రోకో చేపట్టారు. ప్రైవేట్ డీలర్లు యూరియాతో పాటు పురుగు మందులను బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఆందోళనకు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది.