అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
JGL: కొడిమ్యాల మండలం తిప్పాయపల్లికి చెందిన కొలకాని సతీశ్(28) మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శాత్రాజుపల్లిలోని అత్తగారి ఇంటి వద్ద భార్యా పిల్లలను దించిన అతను ప్రమాదవశాత్తు కింద పడ్డానని వేకువజామున వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.