VIDEO: ఇల్లంద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ
WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద జాతీయ రహదారిపై ఇవాళ ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు మానవత్వంతో స్పందించి రక్తస్రావంతో ఉన్న బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.