భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కోడె మొక్కులతో, ఇతర మొక్కులు తీర్చుకున్నారు. పరివార దేవతలను సైతం దర్శించుకుని పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తలనీలాలు సమర్పించుకొని సేవలో తరించారు.