450 లీటర్ల సారా ఊట ధ్వంసం.. ఇద్దరిపై కేసు నమోదు

450 లీటర్ల  సారా ఊట ధ్వంసం.. ఇద్దరిపై కేసు నమోదు

అన్నమయ్య: మదనపల్లి మండలంలో నాటు సారా తయారీ స్థావరాలపై శనివారం దాడులు నిర్వహించి నాటు సారా ఊట ధ్వంసం చేసినట్లు సీఐ భీమలింగ తెలిపారు. నారమాకుల తాండాలో నాటు సారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో సబ్ ఇన్ స్పెక్టర్ జబీ ఉల్లా, డార్కస్ తమ సిబ్బందితో.. బాణామత్ పద్మ, బాణామత్ సరస్వతి ఇళ్లపై దాడులు చేసి, తుమ్మ చెక్క బెల్లపు ఊట 450 లీటర్లు ధ్వంసం చేసి కేసు నమోదు చేశారు.