నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు పట్టణం రాజేంద్ర నగర్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈ శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే క్రమంలో ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.