ప్రమాద బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

WGL: పోస్టల్ ప్రమాద బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట పోస్టల్ ఇన్స్‌పెక్టర్‌సు కోరారు. నర్సంపేటలోని పోస్టాఫీసులో పోస్టల్ ఇన్స్యూరెన్స్ కరపత్రాలను బుధవారం విడుదల చేశారు. రూ.520లు చెల్లిస్తే రూ.10లక్షలు, రూ.755లకు రూ.15లక్షల బీమా అందుబాటులో ఉందన్నారు. పోస్టు మాస్టర్ రాజేందర్ తదితరులున్నారు.