రేపటి నుంచి రేణుకా దేవి సిద్ధియోగ ఉత్సవాలు

రేపటి నుంచి రేణుకా దేవి సిద్ధియోగ ఉత్సవాలు

NZB: కొండాపూర్ గ్రామంలోని గౌడ కులస్తుల ఆధ్వర్యంలో మహమానిత్వ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి ఉత్సవాలు ఆదివారం నుంచి 4 రోజులు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రతిరోజు రాత్రి ఒగ్గుకథ కార్యక్రమం ఉంటుందని శనివారం గౌడ సంఘం వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.