చెత్త సేకరణ పునఃప్రారంభం

MDK: జిల్లాలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణ ట్రాక్టర్లకు బిల్లులు రాక గ్రామాల్లో చెత్త సేకరణను నిలిపివేశారు. నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణ ప్రారంభించారు. గత 15 రోజుల నుంచి చెత్త సేకరించకపోవడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయింది. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మళ్ళీ చెత్త సేకరణ ప్రారంభించారు.