'ప్రజావాణి' దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

'ప్రజావాణి' దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

SRPT: 'ప్రజావాణి'లో వచ్చే దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఆయన ప్రజల నుంచి 83 అర్జీలను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, ఇతర వ్యక్తిగత సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాలని అధికారులకు సూచించారు.