రామాలయం హుండీ ఆదాయం లెక్కింపు
KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో హుండీలను మంగళవారం లెక్కించారు. రామయ్య దర్శనానికి వచ్చిన భక్తులు గత నెల 9వ తేదీ నుంచి మంగళవారం వరకు హుండీలో కానుకలు సమర్పించారు. రంగ, ముఖ మండపం, భక్త వీరాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను TTD సిబ్బంది శ్రీవారి సేవకులు మదింప చేయగా రూ. 7,45,356 ఆదాయం వచ్చినట్లు ఆలయ తనిఖీ అధికారి నవీన్ కుమార్ తెలిపారు.